టమోటా ధరలు మరింత పెరిగాయి. రెండు నెల లుగా కిలో రూ. 10కూడా పలకని టమోటా ధర వారం రోజులుగా క్రమేపీ పెరుగుతోంది. 4 రోజులుగా కిలో రూ. 30 పలికింది. శనివారం మరింత పెరిగి గరిష్టంగా కిలో రూ. 40కి చేరుకొంది. పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు ధర రూ. 550 నుంచి 600 వరకు పలికింది. అనంతపురం జిల్లాలో దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో చెన్నై, ఆంధ్ర ప్రాంతాల్లో గిరాకీ పెరిగినట్లు తెలిసింది.