మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఈవీఎం మెషిన్లు ధ్వసం చేసిన ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆదివారం పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.