బూర్జ మండలం లక్కుపురం గ్రామంలో ఎస్సీ వీధిలో సోమవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రేగాన ఆనందరావు ఇల్లు పూర్తిగా కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో 6. 25 తులాల బంగారంతో పాటు 50 వేల రూపాయల నగదు, ఆహారపు ధాన్యాలు, బట్టలు కాలి బూడిద అయ్యాయని బాధితులు వాపోయారు. పాలకొండ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ కే దీప పరామర్శించారు.