కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతులకు వజ్రాలు కనిపించాయి. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మూడు వజ్రాలు దొరికాయి. దీంతో ఆ అన్నదాతలు తెగ సంబరపడ్డారు. ఆ మూడు వజ్రాల విలువ 20 లక్షల వరకు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేశారు. ఆ రైతులకు డబ్బు అవసరం ఉందో ఏమో 15 తులాల బంగారం ఇస్తే స్థానిక వ్యాపారికి ఇచ్చేశారు. వజ్రాలు దొరికినప్పటికీ తక్కువ ధరకు విక్రయించారు.గత వారం రోజుల్లో వజ్రాలు దొరకడం ఇది ఐదోసారి. పొలం పనులు చేస్తుండగా జొన్నగిరి, మదనంతపురం, పగిడిరాయి, దేశాయి తండా రైతులకు 10 వజ్రాలు దొరికాయి. అప్పటినుంచి వజ్రాల కోసం స్థానికులతోపాటు పక్క గ్రామాల వారు వజ్రాల వేటకు వెళుతున్నారు. తమకు వజ్రాలు దొరకుతాయాని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక ఫలిస్తుందో లేదో చూడాలి.వజ్రాల వేట కోసం పొలంలో వెతుకుతున్న రైతులు వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. సోమవారం రైతులకు మూడు వజ్రాలు లభించగా తక్కువ ధరకే విక్రయించారు. రైతుల అవసరాన్ని స్థానిక వ్యాపారి క్యాష్ చేసుకున్నారు.