ఎన్నికల్లో తన గెలుపు కోసం జనసైనికులు చేసిన కృషి మరువలేనిదని గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ అన్నారు. పలకలూరు రోడ్డులోని గుంటూరు క్లబ్‌లో నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నసీర్ మాట్లాడుతూ 15 రోజుల ముందు ఎన్ని కల యుద్ధంలో పవన కల్యాణ్ పిలుపు మేరకు తన గెలుపు కోసం జనసైని కుడిలా పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి పేరుపేరునా ధన్యవా దాలు తెలిపారు. ముఖ్యంగా పవన కల్యాణ్‌కున్న ప్రజా బలం, చంద్రబాబుకున్న రాజకీయ అనుభవం, మోదీకి ఉన్న ముందుచూపు దేశ భవిష్యత్తుకు అవసరం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. త్వరలో ఎన్డీఏ కూటమి అధికా రంలోకి వస్తుందని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రజా భవిష్యత్తు, గుంటూరు తూర్పు అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
![]() |
![]() |