కురుపాం ఆసుపత్రి సమీపంలో శివ్వన్నపేట వెళ్లే రహదారి పక్కన మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తేనెపట్టుకు చెట్ల కొమ్మలు తగలడంతో ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్లే వారిపై దాడి చేయడంతో వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. అయినప్పటికీ కొంతమందికి కుట్టడంతో గాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స నిర్వహించకుని వెళ్లిపోయారు. వీరిలో కురుపాం ఆసుపత్రిలో పనిచేస్తున్న గాజులరేగకు చెందిన పి.దిలీప్(23), ఎంపీటీసీ వి.బంగారునాయుడు, బి.శేఖర్, కె.అంజనేయులు, పి.మంగ, డి.ప్రియాంక, ఎ.శ్రీధర్, తదితరులు సుమారు 20 మంది తేనెటీగల దాడికి గురయ్యారు. వీరికి ఎటువంటి అపాయం లేకపోవడంతో వెంటనే ఇంటికి వెళ్లిపోయారు.
![]() |
![]() |