రాజానగరం మండలం లోని జి.యర్రంపా లెం సమీపంలో గ్రావెల్ లారీ ఢీకొ ని ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజమ హేంద్రవరానికి చెందిన అంగార పు సురేష్ (37) మంచాలు తయారు చేసి, పరిసర గ్రామాల్లో విక్రయిస్తుంటాడు. దీనిలో భాగంగా ఆదివారం బాకీలు వసూలు కోసం బైక్‌పై వెళ్తుండగా జి.యర్రంపాలెం సమీపంలో ఎదురుగా గ్రావెల్ లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. సురేష్ లారీ కిందపడ డంతో కొంతదూరం ఈడ్చుకుపోయింది. తలకు బల మైన గాయాలై సంఘటనా స్థలంలోనే చేతులు తెగిపడి నుజ్జునుజ్జుగా మారి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |