ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు 28,29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ విద్యాలయాల సమన్వయ అధికారి డాక్టర్ ఐ.శ్రీదేవి ఆదివారం తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో మిగులు ఉన్న సీట్లకు ఈ నెల 28న బాలురకు చిన్నటేకూరులో, 29న దిన్నెదేవరపాడులో బాలికలకు ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. బాలుర విభాగంలో ఎస్టీ 22 మార్కులు, ఎస్సీ 25, బీసీ 45, ఓసీ 44 మార్కులపైన ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. బాలికల విభాగంలో ఎస్సీ 19, ఎస్టీ 19, బీసీ 41, ఓసీ 40 పైగా మార్కులు వచ్చిన వారు దిన్నెదేవరపాడు గురుకుల పాఠశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని శ్రీదేవి సూచించారు.
![]() |
![]() |