బుక్కరాయసముద్రం మండల వ్యాప్తంగా వేరుశనగ సాగు చేసే ప్రతి రైతుకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలను సరఫరా చేస్తామని సోమవారం వ్యవసాయశాఖ అనంతపురం ఏడిఏ రవి తెలియజేసారు. మండలంలో పంపిణీ చేస్తున్న విత్తన కాయలని ఆయన పరిశీలించారు. మండలంలో 2235 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 1875 మంది రైతులు డబ్బులు చెల్లించారని, 1385 మంది రైతులు 1224. 2 క్వింటాళ్ళు వేరుశనగ తీసుకెళ్లారని తెలియజేసారు.
![]() |
![]() |