గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, నాకా బంది నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దృష్ట్యా జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు డీఎస్పీల పర్యవేక్షణలో ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ ేస్టష న్ల పరిధిలో సీఐలు, ఎస్‌ఐలు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఎన్నికలకు సంబంధించి పాత నేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఎలాంటి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ ేస్టషన్లకు తరలించారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, నాకాబంది నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. స్థానికులతో గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి ఎన్నికల నియ మావళి అమలులో ఉందని, నిబంధనలు పాటించాలని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ రోజు ఎలాంటి గొడవలకు దిగరాదని, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. కౌంటింగ్ రోజు బార్‌లు మూసివేసి పోలీసులకు సహకరించాలని ఆయా నిర్వాహకులకు పోలీసులు నోటీ సులు జారీ చేసారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, దానిని అతిక్రమించి అనవసరంగా క్రిమినల్ కేసులలో ఇరుక్కుంటే వచ్చే నష్టాలను గురించి పోలీసు అధికారులు వారికి వివరించారు. ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, నాకాబంది కార్యక్రమాలలో ఆయా సబ్ డివిజన్ల సీఐలు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |