గుంతకల్లు పట్టణం మార్కెట్టు యార్డులోని రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందజేయనున్న విత్తన వేరుశనగ కాయలను మంగళవారం స్థానిక సిపిఎం, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు 90 శాతం సబ్సిడీతో అందజేయాలని వ్యవసాయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు, రైతు సంఘం మండల కార్యదర్శి దాసరి శ్రీనివాసులు కసాపురం రమేష్, జగ్గలి రమేష్ పాల్గొన్నారు