కౌంటింగ్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఏమరుపాటు పనికిరాదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్దులు, పార్లమెంట్ అభ్యర్దులు, చీఫ్ ఎలక్షన్ ఏజంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.