పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపి సిఈఓ ఇచ్చిన నిబంధనలు అభ్యంతరకరంగా ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో ఈసి నిబంధనలను పంపింది. ఆఖరికి ఈసి నిబంధనలను కూడా ఆంధ్రప్రదేశ్ లో మారుస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపిలో వెసులుబాటు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పోస్టల్ కవర్లు 13 ఏ,13 బి,ఏ ఏ నంబర్ల కవర్లు ఉండాలి.బ్యాలెట్ పేపర్ లో క్రమసంఖ్య,పోలింగ్ స్టేషన్ నెంబర్ రాయడం వంటివి నిబంధనలు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లపై గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి. ఇప్పుడు స్టాంప్ వేయకపోతే కనుక అతను ఎక్కడ పనిచేసేది స్వయంగా చేతిరాతతో రాసి సంతకం చేస్తే దానిని అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కాని కొత్తగా ఏపి సిఈఓ మాత్రం చేతితో డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిమన్ సంతకాలు కలెక్ట్ చేసి కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి.ఆ విధంగా చెక్ చేసుకోవాలని తాజాగా ఆదేశాలిచ్చారు.దీనిపై తాము అభ్యంతరం చెబుతున్నాం. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఇక్కడ ఎందుకు తీసుకువచ్చారని పేర్ని నాని ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలకు విరుధ్దంగా సిఈఓ ఆదేశాలు ఇవ్వడమేంటి..ఈసి ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉంది.ఏజంట్లు అభ్యంతరం తెలియచేస్తే ఘర్షణలకు దారితీస్తుందన్నారు. ఈసి నిభంధన వల్ల ఓటు రహస్యత అనేది ఉండదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పని నియమావళిని ఏపిలో ఒక రాజకీయపార్టీ అడిగిందని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని ప్రశ్నించారు.