ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలు ఇక్కడ ఎలా అమలు చేస్తారు. ఈ ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ పునరాలోచించాలని కోరారు. వెంటనే సిఈఓ ఆదేశాలు ఉపసంహరించుకోవాలి. ఎన్నికల కమీషన్ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. కౌంటింగ్ సందర్బంగా టిడిపి కుట్రలకు తెరలేపుతోంది.ఈసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమీషన్ నిర్ణయాలు పక్షపాతరహితంగా ఉండాలని అప్పిరెడ్డి కోరారు.