వాటర్పాల్స్ అంటే ఎంతో ఇష్టపడే ఆ స్నేహితులు కాసేపు కేరింతలు కొడదామని బయలుదేరారు. ఇళ్ల వద్ద చెబితే పంపరని క్రికెట్కు వెళ్తున్నామన్నారు. ఆరుగురు మూడు ద్విచక్రవాహనాలపై వెళ్లి నీళ్లలో దిగి గంట పాటు కేరింతలు కొట్టారు. పాటలు పాడుకుంటూ ఆనందంగా గడిపారు. స్నానం చేస్తుండగా వారిలో ఒకరు కాస్త ముందుకు వెళ్లాడు. అక్కడున్న భారీ గోతి(ఊబి)లో చిక్కుకున్నాడు. ఆర్తనాదాలు చేస్తూ మునిగిపోతుండడంతో అతన్ని కాపాడటానికి మరో ఇద్దరు వెళ్లారు. వారు కూడా అదే విధంగా కేకలు వేస్తూ గల్లంతయ్యారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురూ విగతజీవులుగా కంట పడ్డారు. విజయనగరం జిల్లా, జామి మండలం జాగరం వాటర్పాల్స్ వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే నవ్వుతూ బయటకు వెళ్లిన పిల్లలు అంతలోనే అచేతనంగా కంటపడడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.