ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు వైసీపీ దాడిలో గాయపడ్డారు.ఈరోజు(గురువారం) హైదరాబాద్లో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడును తన నివాసంలో కలిశారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. వైసీపీ అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని చంద్రబాబుకు మాణిక్యాలరావు వివరించారు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్లో తలదాచుకున్నానని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు కూడా మొరపెట్టుకున్నానని వాపోయారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాణిక్యాలరావు పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు.