జనసేన పార్టీ కీలక నేత నాగబాబు.. కూటమి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని.. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కొంత ఉద్వేగానికి లోనై దాడులు నిర్వహిస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని.. కాబట్టి అటువంటి వాటికి ప్రతిస్పందించొద్దని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు పార్టీ కార్యకర్తలకు ట్విటర్ వేదికగా తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని పేర్కొన్నారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని హితవు పలికారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించ వద్దన్నారు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని.. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని నాగబాబు స్పష్టం చేశారు.