సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఎమోషనల్ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. విజయవాడలో ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నానని అన్నారు. తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఏబీ వెంకటేశ్వరావు.. ఇవాళ నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.