తిరుమల శ్రీవారిని మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు.