ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పోస్టల్ బ్యాలెట్ పై వివాదాల రేపేందుకు తంటాలు పడుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎంత తలకిందులుగా తపస్సు చేసినా వారి దింపుడుకళ్లెం ఆశలు ఫలించవని, ఆ పార్టీ ఓటమి పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం కానుందన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు శాశ్వతంగా దూరమైపోయిందన్నారు.