తల్లిదండ్రుల ఆశలు తీరేందుకు పిల్లలపై ఒత్తిడి పెంచకుండా ఉండడమే మేలు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణులు అలవాటు చేయకుండా ఉండడం మంచిది. నగరాలు, పట్టణాల్లో ఉండే వారు పిల్లలను ఒంటరిగా ఉంచకుండా తరచూ పెద్ద వారితో కలిపిస్తూ ఉండడం.. కుదరకపోతే వారానికోసారి వీడియో కాల్‌లో మాట్లాడించడం చేయాలి. ఎక్కువశాతం పిల్లలతో గడిపేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండేళ్ల వయసు నుంచే నీతి కథలు, చదువు ప్రాముఖ్యత, పుస్తకాల విలువ తెలియజేస్తూ వారిలో అలవాటును పెంపొందించాలి.