మాచర్ల మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రజలు గుంపులుగా బయట తిరగవద్దని మాచర్ల పోలీసులు విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజున బాణసంచా కాల్చడం, ర్యాలీలు, కేక్ కటింగ్, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. ఎవరూ రోడ్లమీదకి రావొద్దని. ఎవరి ఇంట్లో వారు ఉండాలన్నారు. గ్రామాల్లో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈనెల 5న సాయంత్రం వరకు అన్నిరకాల షాపులు మూసేయాలని ఆదేశించారు.