10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 పరీక్ష కేంద్రాల్లో 1, 963 మంది విద్యార్థులు హాజరుకావాల్సిందిగా 1, 133 మంది హాజరయ్యారని అన్నారు. 830 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పరీక్షలు సజావుగా సాగేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను సిబ్బందిని అభినందించారు.