సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం జంక్షన్ లో శుక్రవారం రాత్రి ఎస్సై సురేష్ వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న 840 గ్రాములు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంతమాగులూరు ఎస్సై సురేష్ బాబు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టుబడిన బంగారం విలువ 61, 26, 492 రూపాయలు ఉంటుందని ఎస్సై చెప్పారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa