ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ ప్రక్రియకు ముందు, కౌంటింగ్ జరుగుతున్నప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్రలపై పలు సూచనలు చేశారు. మంగళవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్‌ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలని, అయితే ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఏజంట్‌కు అవకాశం కల్పించాలని సీఈవో ముకేశ్ కుమార్ తెలిపారు. కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం-17సి, పెన్ను, పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలన్నారు. వీటికి మించి ఏం ఉన్నా అనుమతించకూడదని స్పష్టం చేశారు.