ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాపాలు ఈ నెల 4వ తేదీతో పండనున్నాయని అమరావతి రైతులు పేర్కొన్నారు. ఇంతటితో ఆయన పరిపాలన అంతమవుతుందని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రిని తాము ఎన్నడూ చూడలేదన్నారు. పార్టీకి ఓటు వేసినా.. వేయకున్నా ప్రజల మీద ముఖ్యమంత్రికి ప్రేమ అనేది ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో కూటమి విజయం సాధించాలంటూ ఆ ప్రాంత రైతులు యజ్జం నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల అవమానాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు.