విజయనగరం జిల్లా, సంతకవిటి మండలంలోని సిరిపురానికి చెందిన జూనియర్ లైన్‌మెన్(జేఎల్‌ఎం) బూరాడమాధవరావు(26) శనివారం విద్యుత్‌ఘాతంలో మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. సంతకవిటి మండలం లోని మోదుగులపేట గ్రామ సచివాలయంలో మాధవరావు విధులు నిర్వహి స్తున్నాడు. శుక్రవారం వీచిన గాలివానకు గ్రామంలో ఓ పంటపొలంలో విద్యు త్ వైర్లు తెగిపడ్డాయి.శనివారం అటుగా వెళ్లిన మాధవరావు తెగిపడిన వైర్లను సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. మాధవరావు ఉద్యోగం చేసి సంపాదించిన జీతం డబ్బులతో కుటుంబమంతా జీవించేది. ఆయనమృతితో కుటుంబం వీధినపడిది. పెద్ద కుమారుడు పోలి నాయుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. కాగా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకొని తమకు తగిన న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కో రుతున్నారు.మాధవరావు మృతిచెందడంతో సిరిపురంలో విషాధచాయలు అల ముకున్నాయి గ్రామంలో అందరితో కలగొలుపుగా ఉండేవాడని, ఎవరికి విద్యు త్ సమస్యవచ్చినా తక్షణమే చర్యలు తీసకొని పరిష్కరించేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.కాగా మృతదేహానికి రాజాం సామాజిక ఆసుపత్రిలో శవ పంచనామ నిర్వహించిన అనంతరం పోస్టుమర్టం నిర్వహించారు. ఈవిష యంపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa