ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలైంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రివర్గమంతా ఓటమి చవిచూసింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన వైసీపీ.. ఈ సారి సైకిల్ స్పీడు ముందు చిన్నబోయింది. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తే కేవలం 11 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయలసీమ జిల్లాలలోనూ వైఎస్సార్‌సీపీ ఘోర పరాభవం ఎదురైంది. రాయలసీమ జిల్లాలో 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైసీపీ కేవలం 7 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక వైఎస్ జగన్ మెజారిటీ కూడా పులివెందులలో భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే జగన్ 25 వేలకు పైగా మెజారిటీ కోల్పోయారు.
వైసీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు
పులివెందుల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి
మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి
రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
బద్వేలు దాసరి సుధ
ఆలూరు విరూపాక్షి
యర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్
దర్శి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
అరకు రేగం మత్స్యలింగం
పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు