పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు వ్యూహాలను ప్రయోగించారని అవి పిఠాపురంలో పనిచేయలేదని జనసైనికులు మీడియాకు తెలిపారు. మిధున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజాలను మండలానికి ఒకరిని నియమించినా, ఎన్నికల సొమ్ము పంచడంలో విఫలమై నాయకులు భారీగా దోచుకున్నారని అదే వైసీపీ ఓటమికి దారితీసిందన్నారు. అంతేగాక వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానన్న ఆయుధం కూడా ఎక్కడా కానరాలేదు.