ధర్మవరంలో శుక్రవారం బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మవరానికి చెందిన పలువురు బీసీ నాయకులు హాజరై ధర్మవరం నియోజకవర్గంలో బీసీలందరూ ఏకమై సత్యకుమార్ యాదవ్ ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇకనుండి ధర్మవరంలో బీసీల రాజ్యం నడుస్తుందని బిసి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ అన్నారు. సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్మవరాన్ని అభివృద్ధి చేద్దామని మాజీ కౌన్సిలర్ బోయ రవిచంద్ర అన్నారు.