శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం టిడిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని, రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జై టిడిపి అంటూ నినాదాలు చేశారు.