గుంతకల్లు పట్టణంలోని ఎన్నికల 14 వ వార్డు సరస్వతి విధ్యామందిరం సమీపంలో ఇళ్లలోకి వచ్చిన మురుగు నీరును అసిస్టెంట్ ఇంజనీరు దేవేంద్ర, ఆ వార్డు సచివాలయం శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ శుక్రవారం యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులతో తొలగింపజేశారు. ఇళ్ల యజమానులు తమ కామౌండ్ గోడలను మురికి కాలువలపై కట్టుకోవడంతో కార్మికులు శుభ్రం చేయడానికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. దీంతో మురుగు నీరు ఇళ్లలోకి వస్తాయని అన్నారు.