బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం చీరాల పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. టీ బంకులు, హోటళ్ళు, మెకానిక్ షెడ్లు, వేరుశనగ ఖార్ఖానా తదితరాలను వారు ఆకస్మికంగా సందర్శించి బాల కార్మికులు ఎవరైనా పనుల్లో ఉన్నారా అని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ బాలలను పనుల్లో పెట్టుకోవడం నేరమని, అలాంటి సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.