యోగి వేమన విశ్వవిద్యాలయానికి రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్- 2( రూసా) కింద 52 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటికి రూ. 3. 49 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటా యించింది. ఇప్పటికే తొలివిడతగా రూ. 1. 53 కోట్ల నిధు లను విడుదల చేసింది. ఒకేసారి 52 ప్రాజెక్టులు పొందిన విశ్వవిద్యాలయంగా వైవీయూ ఘనత సాధించిందని వీసీ ఆచార్య చింతా సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.