ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల యొక్క కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయాన్ని పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారని అన్నారు. ఎటువంటి దాడులు ప్రతిదాడులు జరగకుండా సంయమనం పాటించాలన్నారు.