నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను గ్రామంలో మారెమ్మ గుడివద్ద మంచినీటి సౌకర్యం కోసం ఆదివారం ఎమ్మెల్యే జయసూర్య కొత్తగా బోరును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.... నియోజకవర్గంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథరెడ్డి, గ్రామ నాయకులు సత్యనారాయణరెడ్డి, నాగేశ్వరెడ్డి, తలారి వెంకటరాముడు, దిలీప్కుమార్నాయుడు, విజయుడు, నవీన్‌రెడ్డి, వెంకటరాముడు, తదితరులు పాల్గొన్నారు.