ఈ విజయం ప్రజల విజయంగా భావిస్తున్నామని జనసేన పీఏసీ ఛైర్మ్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అయన మాట్లాడుతూ.. గవర్నర్కు కూటమి తరఫున కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరామన్నారు. ఇది రాజ్యంగ పరమైన ప్రక్రియ అని.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తారని నాదెండ్ల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, సుపారిపాలన కూటమితోనే సాధ్యం అని చెప్పారు.