రాయలసీమను రతనాల సీమ అంటారు. ఆ పేరుకు తగ్గట్లుగానే అక్కడ ఎప్పుడూ రత్నాలు దొరుకుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, చిన్న జొన్నగిరి గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలకు రెండు వజ్రాలు లభించాయి. కూలీలు పని చేస్తుండగా.. వారికి వజ్రాలు లభించాయి. పగిడి రాయిలో దొరికిన వజ్రాన్ని గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి.. రూ. 4.50 లక్షలు, రెండు తులాల బంగారం ఇచ్చి దక్కించుకున్నారు. చిన్న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ. 1.70, లక్షలు రెండు తులాల బంగారు ఇచ్చి స్థానిక వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు.