ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎటువంటి సమస్య వచ్చిన ప్రజలపక్షాన నిలబడతా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2024, 06:31 PM

నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గుంతకల్లు నియోజకవర్గంలో నెలకొని ఉన్న పారిశుధ్య సమస్య, తాగునీటి సమస్య, రోడ్లు, వైద్య సదుపాయాల విషయంగా దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా ఓ కుటుంబ సభ్యుడిలా సాయపడతానన్నారు. పార్టీ శ్రేణులు కూడా గొడవలకు పోయి పోలీసు స్టేషన మెట్లను ఎక్కరాదని, గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ మండలాభివృద్ధి కార్యాలయం మెట్లు ఎక్కాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com