రేగిడి మండలంలోని బూరాడ గ్రామం వద్ద సోమవారం సాయంత్రం గుర్తు తెలియని ముగ్గురు యువకులు మత్తులో హల్చల్ చేశా రు. వీరికి ఎదురపడిన వారిపై కవ్వింపు చర్యలకు దిగి దాడులకు తెగబడ్డారు. ఒకదశలో వారు గ్రామస్థులపై రాళ్లు విసి రినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన లుకలాపు శ్రీనివాసరావు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులంతా తిరగబడి మత్తులో ఉన్న యువకులకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు యువకులు పరారు కాగా... ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. వారి వద్ద గంజాయి ఉందని... ఆ మత్తులోనే తమపై దాడులకు తెగబడినట్లు స్థానికులు చెబుతున్నారు. వారిది రాజాం మండలం గడ్డి ముడిదాంగా గుర్తించారు. పట్టుబడిన ఎస్.సాయికుమార్‌పై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.