గుంటూరు జిల్లా, పెదకాకాని వద్ద జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా ఏస్ వాహనంలో డెకరేషన్ చేసే పని వాళ్ళు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.