ఏపీలో ఎన్డీఏ కూటమి పక్షాల నేత ఎన్నిక వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరి కంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదిక పైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు. అందరితో పాటే తానని.. అందరూ అక్కడ సమానమేనని ప్రత్యేక కుర్చీని తీసివేయించారు. ఆ వెంటనే నిర్వాహకులు మిగతా వారితో సమానంగా కుర్చీ వేశారు. దీనిని కూటమి పక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆసక్తిగా గమనించారు.