శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే ఎస్. సవితమ్మ తన తండ్రి స్వర్గీయ మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఎస్. రామచంద్ర రెడ్డి బాటలో రాజకీయాల్లోకి వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో సవితమ్మ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ ఛైర్పర్సన్ గా పనిచేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గా వున్న సవితమ్మ కు ఎమ్మెల్యే టికెట్ దక్కడం తొలి సారి మంత్రి పదవి వరించింది. సవితమ్మ 1977 జనవరి 15న పెనుకొండ మండలం రామపురంలో జన్మించారు. 1998లో అనంతపురం శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీలో బిఏ పూర్తి చేశారు. 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించిన సవితమ్మ ఈ ఎన్నికల్లో తొలిసారి తొలిసారి ఎమ్మెల్యే గా గెలుపొందారు. చంద్రబాబు మంత్రి వర్గంలో సవితమ్మ కు మంత్రి గా అవకాశం దక్కింది.