అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ (54)కు కోర్టు జైలు శిక్ష విధించింది. అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలకు సంబంధించిన మూడు కేసుల్లో హంటర్ బైడెన్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.అయితే అతనికి విధించే శిక్షను కోర్టు ఇంకా ప్రకటించ లేదు. సాధారణంగా కోర్టు దోషిగా నిర్ధారించిన 120 రోజుల్లో నిందితుడికి శిక్ష విధించడం జరుగుతుంది. ఈ కేసులో జో బిబెన్ కుమారుడికి ఏ విధమైన శిక్ష విధిస్తారనేది ఆసక్తిగా మారింది.చట్టవిరుద్ధంగా గన్ కొనుగోలు చేయడంలో ముడు కేసులు హంటర్ బిడెన్‌పై నమోదు కాగా జ్యూరీ దోషిగా నిర్ధారించింది. దోషిగా కోర్టు తేల్చిన అనంతరం అధ్యక్షుడు భావోధ్వేగానికి గురయ్యారు. ‘నేను అధ్యక్షుడిని, కానీ నేను కూడా తండ్రిని. ఈ కేసులో కోర్టు తీర్పును గౌరవిస్తున్నాను. నా కుమారుడు హంటర్ అప్పీల్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నందున న్యాయస్థానం ఇచ్చే తీర్పును గౌరవిస్తాను. హంటర్‌కు గరిష్టంగా 25 యేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఓ ప్రకటనలో జో బిడెన్ పేర్కొన్నారు. కాగా ఓ దేశ అధ్యక్షుడి కుమారుడికి జైలు శిక్ష పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. మారణాయుధం కొనేటప్పుడు తన దగ్గర ఉన్న మాదకద్రవ్యం గురించి అబద్ధం చెప్పిన హంటర్ బైడెన్‌పై ఉన్న మొదటి అభియోగంలో పదేళ్లు, అలాగే రెండో కేసులో ఐదేండ్లు, మూడో కేసులో మరో పదేండ్లు శిక్ష పడవచ్చు.
హంటర్ బిడెన్ కొకైన్‌కు బానిసై ఉన్న సమయంలో 2018లో గన్ కొనుగోలు చేయాలనుకున్నాడు. అయితే మాదకద్రవ్యాల వినియోగంపై అతడు తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనిపై కోర్టు విచారణ సమయంలో హంటర్ మాజీ భార్య కాథ్లీన్ బుహ్లే, అతని సోదరుడి భార్యతో సహా అతని జీవితంలోకి వచ్చిన అనేక మంది మహిళల సాక్ష్యాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. హంటర్ మాజీ ప్రియురాలు, అతని కుమార్తె నవోమీ బిడెన్ కూడా అతడి మాదకద్రవ్యాల వినియోగంపై కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. పైగా అతడు తన మెమరీ బుక్ ‘బ్యూటిఫుల్ థింగ్స్’లో కూడా తన మాదక ద్రవ్యాల వ్యసనం గురించి స్వయంగా రాశాడు. రివాల్వర్‌ను కొనుగోలు చేసిన సమయంలో తనను తాను డ్రగ్స్ బానిసగా భావించలేదని పేర్కొన్నాడు. మంగళవారం సుమారు మూడు గంటల పాటు కోర్టులో విచారణ ముగిసిన తర్వాత జ్యూరీ హంటర్‌ను అన్ని కేసుల్లో దోషిగా నిర్ధారించింది. అతడికి త్వరలో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.