రైతులకు ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేయనున్నట్లు ఏవో బుజ్జిబాయ్ తెలిపారు. పెద్దారవిడు మండలంలోని దేవరాజుగట్టు రైతుభరోసా కేంద్రంలో గురువారం రాయితీపై మంజూరైన పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందజేశారు. మండలంలో ఇప్పటి వరకూ 6 క్వింటాల పిల్లిపెసెర, 4 క్వింటాల జిలుగలు 50 శాతం రాయతీపై అందజేయనున్నట్లు తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు రైతుభరోసా కేంద్రంలో సంప్రదించాలన్నారు.