పొగాకు గ్రేడింగ్ సమయంలో అన్య పదార్థాలు లేకుండా చూసుకోవాలని, అలాంటి బేళ్లకు అధిక ధర పొందవచ్చని కొండేపి వేలం నిర్వహణాధికారి జి సునీల్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో గురువారం రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం నిర్వహించిన వేలంలో కామేపల్లి, పచ్చవ గ్రామాలకు చెందిన రైతులు 1,074 బేళ్లు ఉంచగా 1013 కొను గోలయ్యాయి. 61 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 330, కనిష్ట ధర రూ. 205 పలికింది.