పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గురువారం ఆయన తాడేపల్లి సచివాలయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ సామాజిక పద్ధతి పాటిస్తుందన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, రైతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు పెంపుపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు.