రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని గురువారం రాజధాని అమరావతి క్యాంపు కార్యాలయంలో కొండేపి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కలిసి అభినందనలు తెలిపారు. టంగుటూరు మండలానికి చెందిన నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మంత్రిని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.