ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డివైడర్‌ను ఢీకొన్న బస్సు, తప్పిన ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 06:50 PM

నరసన్నపేట పరిధిలోని మడపాం టోల్‌గేట్‌ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ముందు టైర్‌ పేలి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మడపాం టోల్‌ ప్లాజా వద్ద హైవేపై మందు టైర్‌ పంక్చరై అదుపు తప్పింది. బస్సును కంట్రోల్‌ చేసే సమయంలో టోల్‌గేట్‌ వద్ద ఉన్న డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పోలాకి చెందిన బి.విజయదుర్గారావు ముక్కు పై తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురు సల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నేషనల్‌ హైవే అంబు లెన్స్‌లో నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆ సయమంలో వైద్యులు లేకపోవడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించా రు. సల్పంగా గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేసి పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com