శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో చేరేందుకు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ లో ఈ నెల 18వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఒక ఏడాది, రెండేళ్లు వ్యవధి గల కోర్సుల్లో అడ్మిషన్లకు గా ను ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు కౌ న్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సర్టిఫికేట్లు పరిశీలన పూర్తిచేసుకున్న అభ్యర్థులకు పదో తరగతి మార్కుల మేరకు ర్యాంకులు కేటాయించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. షెడ్యూల్ ప్రాప్తికి అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు నిర్ధేశించిన తేదీల్లో హాజరు కావల్సిన వివరాలను వారి మొబైల్‌కు సమాచారం అందించామన్నారు. సీటు పొందని అభ్యర్థులకు తిరిగి ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఎలక్ట్రీషియ న్, ఫిట్టర్, ఎలట్రానిక్ మెకానిక్, ఇన్స్‌స్ట్రుమెంట్ మెకా నిక్, డ్రాప్ట్స్‌మన్ సివిల్ రెండేళ్లు కోర్సులు కాగా, వెల్డ ర్, మెకానిక్ డీజిల్, కటింగ్ అండ్ టైలరింగ్, కం ప్యూటర్స్ ఏడాది కోర్సులని వివరించారు. జిల్లాలోని మూడు ప్రభుత్వ ఐటీఐల్లో 716 సీట్లు, 20 ప్రైవేట్ ఐటీఐల్లో 2,892 సీట్లు ఉన్నట్టు చెప్పారు.